జీరో పెండెన్సీ లక్ష్యంగా ‘ప్రయాస్’.. శ్రీరాంపూర్ ఏరియాకు 1332 రివైజ్డ్ పీపీఓలు

సీఎంపీఎఫ్ అధికారులు మా వద్దకు రావడం శుభపరిణామం
శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్

నస్పూర్, ఆర్.కె న్యూస్: పదవీ విరమణ పొందిన ఉద్యోగుల పీఎఫ్, పెన్షన్ సమస్యలు త్వరితగతిన పరిష్కరించి, ‘జీరో పెండెన్సీ’ సాధించడమే లక్ష్యంగా శ్రీరాంపూర్ ఏరియాలో ‘ప్రయాస్-4’ సమావేశం జరిగింది. గురువారం జీఎం కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్ లో సింగరేణి, సీఎంపీఎఫ్ అధికారులు సంయుక్తంగా ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్, సీఎంపీఎఫ్ రీజనల్ కమిషనర్-2 గోవర్ధన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రీజనల్ కమిషనర్ గోవర్ధన్, శ్రీరాంపూర్ ఏరియాకు సంబంధించిన 1332 రివైజ్డ్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ (పీపీఓ) కాపీలను జీఎం మునిగంటి శ్రీనివాస్‌కు అందజేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. రిటైర్డ్ ఉద్యోగుల సెటిల్మెంట్ల కోసం కొత్తగా అందుబాటులోకి తెచ్చిన సీ–కేర్స్ విధానంలో పెండింగ్ దరఖాస్తులను జీరో స్థాయికి తేవడమే ‘ప్రయాస్’ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఏరియా పరిధిలోని పెండింగ్ క్లేయిమ్స్‌ను సమీక్షించి, వాటిలో ఉన్న లోపాలను సవరించి వెంటనే పరిష్కరించాలని సంక్షేమ అధికారులకు సూచించారు. జీఎం మునిగంటి శ్రీనివాస్ మాట్లాడుతూ.. గతంలో సీఎంపీఎఫ్ సమస్యల పరిష్కారం చాలా జటిలంగా ఉండేదని, అధికారులను సంప్రదించడం కూడా క్లిష్టంగా ఉండేదన్నారు. కానీ ప్రస్తుతం సీఎంపీఎఫ్ అధికారులే నేరుగా మన వద్దకు వచ్చి సమస్యలు పరిష్కరించడం శుభపరిణామం అని కొనియాడారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సంక్షేమ అధికారులు, సిబ్బంది రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని ఆదేశించారు. రానున్న రోజుల్లోనూ జీరో పెండెన్సీ లక్ష్యంగా మరిన్ని ప్రయాస్ మీటింగ్‌లు నిర్వహిస్తామని సీఎంపీఎఫ్ రీజినల్ కమిషనర్ గోవర్ధన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం ఎన్. సత్యనారాయణ, గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి ఎస్.కె బాజీ సైదా, డీజీఎం (పర్సనల్) అనిల్ కుమార్, సీనియర్ పీఓ సురేందర్, గుర్తింపు సంఘం పిట్ కార్యదర్శి సందీప్, వివిధ గనుల సంక్షేమ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment