ఆర్.కె న్యూస్, నస్పూర్: సింగరేణి యాజమాన్యం జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పటి వరకు పరీక్ష నిర్వహించకపోవడంతో కార్మికులు అయోమయానికి గురవుతున్నారని, పరీక్ష తేదీని తెలియజేసి పరీక్ష వెంటనే నిర్వహించాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) శ్రీరాంపూర్ బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు గుండ్ల బాలాజీ, అంబాల శ్రీనివాస్ లు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సింగరేణి వ్యాప్తంగా కార్యాలయాల్లో పనిచేస్తున్న మినిస్టీరియల్ స్టాప్ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని, జూనియర్ అసిస్టెంట్ పరీక్ష వెంటనే నిర్వహించి సిబ్బంది కొరత తగ్గించాలని అన్నారు. ఆఫీసు సిబ్బంది పాత కుర్చీలలో కూర్చొని నడుము, మెడ నొప్పులు వస్తున్నందున కొత్త ఫర్నిచర్ ను ఏర్పాటు చేయాలని, పాతకాలపు ప్రింటర్ల స్థానంలో కొత్త డిజిటల్ స్కానర్ కం ప్రింటర్లను ప్రతి సెక్షన్ లో ఏర్పాటు చేసి సీఎం పిఎఫ్ చిట్టిలను సకాలంలో ఇప్పించేలా చూడాలని, ప్రతి ఆఫీసులో క్యాబిన్లు ఏర్పాటు చేయాలని, ఆఫీసుల నిర్వహణ నిమిత్తం ఉన్న డెలిగేషన్ పవర్ ను కూడా ప్రస్తుత ధరలకు అనుగుణంగా పెంచాలని అన్నారు.
133