ఆర్.కె న్యూస్, మంచిర్యాల: జైపూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా జె. శ్రీధర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జైపూర్ ఎస్‌ఐ మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. అసాంఘిక కార్యక్రమాల కట్టడి, శాంతిభద్రతల పరిరక్షణ తన ధ్యేయమని అన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు 24 గంటలపాటు పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని, ఎలాంటి సమస్యలు ఉన్న నేరుగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని అన్నారు. గంజాయి, జూదం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి పై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. మండలంలోని ప్రజా ప్రతినిధులు, నాయకులు, యువకులు ప్రజలు సహకరించాలని కోరారు. నూతన బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ శ్రీధర్ కు జైపూర్ పోలీస్ సిబ్బంది స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు. జైపూర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించి టాస్క్ ఫోర్స్ ఎస్ఐ గా మంచిర్యాలకు బదిలీ పై వెళుతున్న ఎస్‌ఐ ఉపేందర్ రావు కు పోలీస్ స్టేషన్ సిబ్బంది వీడ్కోలు తెలిపారు.
184