టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు

ఆర్.కె న్యూస్, నస్పూర్: తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో 155 వ మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం నస్పూర్ కాలనీలోని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కార్యాలయంలో టీబీజీకేఎస్ శ్రేణులు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షులు పెట్టెం లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డిలు మాట్లాడుతూ, మహాత్మా గాంధీ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని, భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. గాంధీజీ  చూపించిన శాంతి మార్గంలో ప్రజలందరూ ముందుకు వెళ్లాలని, భారత దేశ ప్రతిష్టను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం డిప్యూటీ జనరల్ సెక్రెటరీ బండి రమేష్, సంయుక్త కార్యదర్శి పానుగంటి సత్తయ్య, కేంద్ర చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పొగాకు రమేష్, ఆర్గనైజ్ సెక్రటరీ అన్వేష్ రెడ్డి, కేంద్ర కార్యవర్గ సభ్యులు ఎండి లాల, గోనె స్వామి, సీనియర్ నాయకులు సాదుల భాస్కర్, గొర్ల సంతోష్, మైపాల్ రెడ్డి, రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment