టోకెన్ సమ్మెను జయప్రదం చేయండి

ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య

ఆర్.కె న్యూస్, నస్పూర్: సింగరేణి కార్మికులకు లాభాల వాటా, దసరా పండుగ అడ్వాన్స్ తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 21న నిర్వహించనున్న టోకెన్ సమ్మెను కార్మికులు యూనియన్లకు అతీతంగా స్వచ్ఛందంగా పాల్గొని జయప్రదం చేసి కార్మికవర్గం ఐక్యతను చాటాలని  ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. బుధవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 7 గని పై జరిగిన గేట్ మీటింగ్, నస్పూర్ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడుతూ, ఈనెల 16వ తేదీన చెల్లించాల్సిన లాభాల వాటా, దసరా పండుగ అడ్వాన్స్ ను యాజమాన్యం నిలిపివేయడాన్ని నిరసిస్తూ ఈనెల 20న కొత్తగూడెంలోని సింగరేణి కార్పొరేట్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. సింగరేణిలో మితిమీరిన రాజకీయ జోక్యం సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు ఉన్నాయన్నారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రభావం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉంటుందనే భయంతోనే బిఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి ఎన్నికల వాయిదాకు సర్వ ప్రయత్నాలు చేసిందన్నారు. సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల్లో ఆర్థిక ప్రయోజనం కల్పించేందుకు కార్మికులకు రావాల్సిన 32 శాతం లాభాల వాటాను, పండుగ అడ్వాన్స్ ను ఆపడం దారుణమన్నారు. సింగరేణి కార్మికులు రక్తాన్ని చెమటగా మార్చి బొగ్గు ఉత్పత్తి చేస్తే సంస్థ లాభాలను ఆర్జించడంతో లాభాల వాటా పుట్టిందని, ప్రతి సంవత్సరం కార్మికులకు లాభాల నుండి వాటాను తీసుకుంటున్నారని, అసెంబ్లీ ఎన్నికలకు కార్మికులకు చెల్లించాల్సిన లాభాల వాటాకు సంబంధమేంటని ప్రశ్నించారు. యాజమాన్యం ఉద్దేశపూర్వకంగానే కార్మికులకు రావాల్సిన డబ్బుల చెల్లింపు నిలిపి వేసిందన్నారు.  ఎన్నికల కోడ్ కు ముందే యాజమాన్యం కార్మికులకు ఈనెల 16వ తేదీన లాభాల  వాటా 32 శాతం చెల్లిస్తామని ఈ నెల 4వ తేదీన సర్క్యూలర్ విడుదల చేసిందని గుర్తు చేశారు.  లాభాల వాటా కార్మికులకు చెల్లించకూడదని ఎన్నికల కోడ్ లో ఎక్కడ లేదన్నారు. కార్మికులు తీసుకునే లాభాల వాటా ప్రభుత్వ పథకం కాదని, రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు అమలు అవుతూ ఉంటే కార్మికుల లాభాల వాటాను నిలిపివేయడం యాజమాన్యం కుట్రలో భాగమన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం వెంటనే కార్మికులకు చెల్లించాల్సిన 32 శాతం లాభాల  వాటా తో పాటు పండుగ అడ్వాన్స్ చెల్లించాలని, లేనిపక్షంలో అవసరమైతే నిరవధిక సమ్మె కైనా వెనుకాడబోమని యాజమాన్యాన్ని హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రేక్ సెక్రటరీ ఎస్.కె బాజీ సైదా, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ బెల్లంపల్లి రీజియన్ కార్యదర్శి అఫ్రోజ్ ఖాన్, నాయకులు మల్లేష్, మారపల్లి సారయ్య, రవీందర్,  లక్ష్మణ్, మల్లికార్జున్, గండి సతీష్, సత్తయ్య, యాదగిరి, రాజం, శ్రీనివాస్, సదానందం, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment