ఆర్.కె న్యూస్, నస్పూర్: సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు, సింగపూర్ మాజీ ఉప సర్పంచ్ తాళ్లపల్లి కొమురయ్య 15వ వర్ధంతిని పురస్కరించుకొని సిపిఐ శ్రేణులు ఘనంగా నివాళులు అర్పించారు. సోమవారం శ్రీరాంపూర్ లోని స్మారక స్థూపం వద్ద సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. తాళ్లపల్లి కొమురయ్య చిత్రపటానికి సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీకి తాళ్లపల్లి కొమురయ్య అందించిన సేవలను కొనియాడారు. కమ్యూనిస్టు పార్టీలో క్రియాశీల నాయకునిగా, యువజన, విద్యార్థి రంగాలకు నాయకత్వం వహించి, సింగపూర్ ఉప సర్పంచ్ గా సేవలందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మేకల దాసు, రేగుంట చంద్రశేఖర్, జోగుల మల్లయ్య, ముస్కె సమ్మయ్య, ఎస్.కె బాజి సైదా, లింగం రవి, కారుకూరి నగేష్ తదితరులు పాల్గొన్నారు.
179