- సిపిఐ జిల్లా కార్య వర్గ సభ్యులు లింగం రవి
ఆర్.కె న్యూస్, నస్పూర్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్ర పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు లింగం రవి అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 76వ వార్షికోత్సవాలను ఆదివారం నస్పూర్ పట్టణ, తాళ్లపల్లి గ్రామ సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు లింగం రవి నస్పూర్ లో, పట్టణ కార్యదర్శి మిర్యాల రాజేశ్వరరావు షిర్కే సెంటర్ లో, మండల కార్యదర్శి జోగుల మల్లయ్య తాళ్లపల్లిలో శాఖలో జెండా ఆవిష్కరించారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు లింగం రవి మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో సుమారు 4500 మంది కమ్యూనిస్టులు ప్రాణ త్యాగం చేశారని, రావి నారాయణరెడ్డి సారధ్యంలో కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో గెరిల్లా రక్షక దళాలుగా ఏర్పడి 10 లక్షల ఎకరాల భూమిని పంచినట్లు, మూడువేల గ్రామాలను విముక్తి చేసినట్లు తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట విలీనాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నదని, బిజెపి ప్రభుత్వం మాత్రం తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తుంది, పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను చేర్చాలని, తెలంగాణ ప్రభుత్వం కూడా అధికారికంగా నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కారుకూరి నగేష్, జిల్లా సమితి సభ్యులు దొడ్డిపట్ల రవీందర్, మోత్కూరు కొమురయ్య, చిలుక రామచందర్, సంఘం సదానందం, కోడి వెంకటేష్, మండల నాయకులు గుడెల్లి రాజయ్య, దాడి రాజయ్య, శాఖపురం భీమరాజు, మర్రి సందీప్ ఆకుల లక్ష్మణ్, దాడి రాజయ్య, తోట మహేష్, ముగురం రాకేష్, ఉయ్యాల శంకర్, బాలసాని లక్ష్మణ్, కంచెం పోశం, ఎండి రషీద్, గద్దె నరసయ్య, నాగపురి సమ్మయ్య, దాసరి రాజేష్, జోగుల ఆంజనేయులు, కొప్పుల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.