దళిత బంధు యూనిట్లను సద్వినియోగం చేసుకోవాలి

దళితుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంలో లబ్ధి పొందిన లబ్దిదారులు తాము ఎంచుకున్న యూనిట్లను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఎస్.సి. కార్పొరేషన్ జనరల్ మేనేజర్ బి. ఆనంద్ కుమార్ తెలిపారు. శనివారం ఎస్.సి. కార్పొరేషన్ జిల్లా ఈ.డి సిహెచ్. దుర్గాప్రసాద్ తో కలిసి దళిత బంధు పథకంలో భాగంగా మంజూరైన జిల్లాలోని జైపూర్ మండల కేంద్రంలోని సెరామిక్స్ ఇండస్ట్రీ, భీమారం మండల కేంద్రంలోని ఫిష్ పాండ్, జైపూర్ మండలం శెట్ పల్లి  గ్రామంలోని టెంట్ హౌస్ యూనిట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్.సి. కార్పొరేషన్ జనరల్ మేనేజర్ మాట్లాడుతూ దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు దళిత బంధు పథకం మొదటి విడతలో నియోజకవర్గానికి 100 మంది లబ్ధిదారుల చొప్పున ఎంపిక చేసి దళిత బంధు నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఈ క్రమంలో లబ్ది పొందిన వారు తాము పొందిన నిధులను పెట్టుబడిగా వినియోగించి ఆర్థికంగా ఎదగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment