దొంగతనం కేసులో ఇద్దరు అరెస్ట్

నస్పూర్, ఆర్.కె న్యూస్: నస్పూర్ మండల పరిధిలోని అభినవ కాలనీలో జరిగిన దొంగతనం కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు మంచిర్యాల రూరల్ సీఐ ఏ. అశోక్  తెలిపారు. మంగళవారం మంచిర్యాల సీఐ అశోక్ సిసిసి నస్పూర్ ఎస్సై ఉపేందర్ రావుతో కలిసి కేసు వివరాలను వెల్లడించారు. ఈనెల 9న సాయంత్రం కూసి తిరుపతి అనే వ్యక్తి ఇంటికి తాళం వేసి సొంత గ్రామానికి వెళ్లి మరుసటి రోజు వచ్చి చూసే సరికి ఇంటి మెయిన్ డోర్‌‌ తాళం పగులగొట్టి ఉందని, ఇంటి లోపలికి వెళ్లి చూడగా బెడ్ రూంలో ఉన్న టేబుల్ లాకర్ ఓపెన్ చేసి ఉందని అందులో ఉన్న పావు తులం బంగారం చెవి కమ్మలు, 2 వేల రూపాయలు నగదు, దేవుడి గదిలో ఉన్న 30 తులాల వెండి వస్తువులు, ఇంటి హాల్ లో ఉండే హోమ్ థియేటర్, సౌండ్ బార్ కనిపించడం లేదని, గుర్తు తెలియని వ్యక్తులు  దొంగతనం చేసినట్లు ఫిర్యాదు చేయగా, సీసీసీ నస్పూర్ పోలీసులు సోమవారం మూడు బృందాలుగా ఏర్పడి కలెక్టరేట్ చౌరస్తా వద్ద నిర్బంధ వాహన తనిఖీలు చేస్తుండగా మంచిర్యాల నుండి గోదావరి ఖని వైపు వేగంగా వెళుతున్న అనుమానిత కారును ఆపి అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులను విచారించగా తాము నస్పూర్‌‌లో దొంగతనం చేసినట్లు నేరం ఒప్పుకున్న రానమల్లె గజనంద్, సయ్యద్ అమాన్ లను రిమాండ్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. దొంగతనం కేసులో నిందితులను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులను మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాష్ లు అభినందించారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment