ధనుంజయ సేవలు అభినందనీయం

ధనుంజయ దంపతులకు ఘన సన్మానం

36 ఏళ్ల సేవలు అభినందనీయం – ట్రస్మా నాయకులు

నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి కాలరీస్ సంస్థకు 36 సుదీర్ఘ సంవత్సరాలు విశిష్ట సేవలు అందించి, ఇటీవల పదవీ విరమణ పొందిన గుడిసేవ ధనుంజయ, రజని దంపతులను ఆదివారం నాడు నస్పూర్ పట్టణంలో ట్రస్మా నాయకులు, స్థానిక పాత్రికేయులు ఘనంగా సన్మానించారు. నస్పూర్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో, ట్రస్మా నాయకులు మల్లెత్తుల రాజేంద్రపాణి, రేగళ్ల ఉపేందర్ పర్యవేక్షణలో ధనుంజయ దంపతులను పూలమాలలు, శాలువాలతో సత్కరించి, గౌరవ సూచకంగా మెమోంటో అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్మా నాయకులు మల్లెత్తుల రాజేంద్రపాణి, రేగళ్ల ఉపేందర్ మాట్లాడుతూ, గుడిసేవ ధనుంజయ సేవలను కొనియాడారు. ధనుంజయ 1989 సంవత్సరంలో సింగరేణి సంస్థలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించి, వివిధ హోదాల్లో అత్యంత నిబద్ధతతో విధులు నిర్వర్తించారని తెలిపారు. ఆయన చివరగా ఆర్.జి-II ఏరియాలో అడిషనల్ జనరల్ మేనేజర్ (సివిల్) హోదాలో పదవీ విరమణ పొందారని వెల్లడించారు. ధనుంజయ సింగరేణి సంస్థ పురోభివృద్ధికి తన వంతు కృషి చేస్తూ, నిర్మాణ రంగంలో ఎంతో విలువైన సేవలు అందించారని పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతరం ధనుంజయ దంపతులు సుఖ సంతోషాలతో, సంపూర్ణ ఆయురారోగ్యాలతో కలకాలం గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా సభ్యులు, పాత్రికేయులు, ధనుంజయ కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment