వందేళ్ల పోరాటాల చరిత్ర సిపిఐ ఘనత
పార్టీ రాష్ట్ర నాయకులు కలవేన శంకర్
నస్పూర్ ఆర్.కె న్యూస్: నస్పూర్ మండల కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) శతాబ్ది ఉత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. శ్రీరాంపూర్ బస్టాండ్, కటిక దుకాణాలు, షిర్కె సెంటర్, కృష్ణ కాలనీ తదితర ప్రాంతాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్, జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ మాట్లాడుతూ.. 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించిన సిపిఐ, వందేళ్లుగా పేదలు, కార్మికులు, రైతుల పక్షాన నిరంతరం పోరాడుతోందన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో వేలాది మంది వీరులు ప్రాణత్యాగం చేసిన ఘన చరిత్ర పార్టీకి ఉందని వారు గుర్తుచేశారు. ఈ ఉత్సవాల ముగింపు సందర్భంగా జనవరి 18న ఖమ్మంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి జోగుల మల్లయ్య, పట్టణ కార్యదర్శులు పూజారి రామన్న, మిరియాల రాజేశ్వరరావు, మండల సహాయ కార్యదర్శి లింగం రవి, జిల్లా సమితి సభ్యులు దొడ్డిపట్ల రవీందర్, బీసీ సాధన సమితి మండల కార్యదర్శి జోగుల ఆంజనేయులు, కోడి వెంకటేశం, కంచె పోశం, కొత్తపల్లి మహేష్, బొడ్డు లచ్చన్న తదితరులు పాల్గొన్నారు.





