ఆర్.కె న్యూస్, నస్పూర్: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని నారాయణ హై స్కూల్ లో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న కరీంనగర్ జోన్ ఎజీఎం అన్నం చైతన్య మాట్లాడుతూ, పిల్లలకు చిన్నతనం నుంచే బలమైన ఆహారం పై అవగాహన ఉండాలని తెలిపారు. చిన్నారులకు తోడుగా వారి తల్లిదండ్రులు ఉండి ప్రోత్సహించడం అభినందనీయమన్నారు.
నాసా కిట్స్ పంపిణీ…
పాఠశాలలోని విద్యార్థులకు ఎజీఎం చైతన్యం నాసా కిట్స్ పంపిణీ చేశారు. అనంతరం నాసా ప్రాజెక్టు ప్రాముఖ్యత తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ మాడిశేట్టి కవిత, హైస్కూల్ కో ఆర్డినేటర్ ప్రవీణ్, చాంప్స్ కో ఆర్డినేటర్ శ్రావణ్, కిడ్స్ కో ఆర్డినేటర్ రవళి ప్రియ, డిన్ వెంకటస్వామి, వైస్ ప్రిన్సిపాల్ అమల, స్రవంతి, ఎఓ సంతోష్, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.