69
నస్పూర్, ఆర్.కె న్యూస్: భగవంతుని ఆశీస్సులతో మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ఆదివారం నస్పూర్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా వేదపండితుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ కృష్ణ కాలచక్రం శ్రీ వైష్ణవ అయుత చండి అతిరుద్రం శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం 86 వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవంలో ఆయన తనయుడు కొక్కిరాల ఉదయ్ చరణ్ రావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల ఎమ్మెల్యే మాట్లాడుతూ, విశ్వశాంతి మహాయాగంలో నియోజకవర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని భగవంతుని కృపకు పాత్రులు కావాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, ఆయన తనయుడు ఉదయ్ చరణ్ రావుకు వేదపండితులు ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.