నిరుద్యోగ యువతను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాజీవ్ యువ వికాసం

  • మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

నస్పూర్, ఏప్రిల్ 01 (ఆర్.కె న్యూస్): నిరుద్యోగ యువత ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా అవకాశం కల్పిస్తుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మంచిర్యాల నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఎస్.సి, ఎస్.టి,  బి.సి, మైనారిటీ, ఇతర వెనుకబడిన తరగతుల నిరుద్యోగ యువత ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఈ పథకం ద్వారా చేయూత అందించడం జరుగుతుందని, అర్హులైన వారు ఈ నెల 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. 50 వేల రూపాయల లోపు రుణం 100 శాతం మాఫీ, 1 లక్ష రూపాయల లోపు రుణం 90 శాతం రాయితీ, 1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు 80 శాతం రాయితీ, 2 లక్షల రూపాయల నుంచి 4 లక్షల రూపాయల వరకు 70 శాతం రాయితీ లభిస్తుందని, రాయితీ పోను మిగిలిన మొత్తాన్ని బ్యాంకు రుణాల ద్వారా అందించడం జరుగుతుందని తెలిపారు. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి రోజు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. లే అవుట్ క్రమబద్దీకరణలో భాగంగా ఎల్.ఆర్.ఎస్ రుసుము చెల్లింపుదారులకు అవగాహన కల్పించి, సకాలంలో చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment