నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాలి

  • సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్) జి. వెంకటేశ్వర్ రెడ్డి

ఆర్.కె న్యూస్, నస్పూర్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి శ్రీరాంపూర్ ఉపరితల గని నిర్దేశిత 35 లక్షల బొగ్గు ఉత్పత్తి సాధించడానికి ఉద్యోగులు కృషి చేయాలని సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్) జి. వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం శ్రీరాంపూర్ ఉపరితల గనిని ఏరియా జనరల్ మేనేజర్ బి. సంజీవరెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా సింగరేణి డైరెక్టర్ సీఆర్ఆర్, జివిఆర్ కంపెనీల ఆఫ్ లోడింగ్ పని ప్రదేశాలను పరిశీలించారు. నిర్దేశిత ఓబీ ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సీఆర్ఆర్ కాంట్రాక్ట్ ప్రతినిధులకు  సూచించారు. రక్షణతో కూడిన ఉత్పత్తి, ఉత్పాదకత సాధించడానికి ఉద్యోగులు కృషి చేయాలన్నారు. 162.45 హెక్టార్ల అటవీ భూమి బదలాయింపు చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపరితల గని ఇన్చార్జి ప్రాజెక్ట్ ఆఫీసర్ ఏం. శ్రీనివాస్, గని మేనేజర్ సుధీర్ జక్కుల్ వార్, క్వాలిటీ మేనేజర్ కె. వెంకటేశ్వర్ రెడ్డి, ప్రాజెక్ట్ ఇంజనీర్ చంద్రశేఖర్, సర్వే అధికారి సంపత్ తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment