- సింగరేణి డైరెక్టర్ జి. వెంకటేశ్వర్ రెడ్డి
ఆర్.కె న్యూస్, నస్పూర్: నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించడానికి ఉద్యోగులు, అధికారులు కృషి చేయాలని సింగరేణి డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్) జి. వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం శ్రీరాంపూర్ ఏరియా జీఎం కార్యాలయంలో జనరల్ మేనేజర్ బి సంజీవరెడ్డితో కలిసి బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత పై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం శ్రీరాంపూర్ ఉపరితల గని వ్యూ పాయింట్ ను సందర్శించి, క్వారీలోని పని ప్రదేశాలు, కోల్ బెంచిలను పరిశీలించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ నిలువ ఉన్న బొగ్గును వీలైనంత త్వరగా వినియోగదారులకు రవాణా చేయాలని, రక్షణతో నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలని, లక్ష్య సాధనకు ప్రణాళికలు వేసుకుని ముందుకు వెళ్లాలని, ఉపరితల గనులకు కావాల్సిన యంత్రాలు, యంత్ర సామాగ్రి సమకూర్చుకోవాలని సూచించారు. సీఆర్ఆర్, జీవీఆర్ ఓబి కాంట్రాక్టు ప్రతినిధులు, ఉపరితల అధికారులు ఎప్పటికప్పుడు నెలవారీ లక్ష్యాలను అధిగమించాలని, రక్షణ నియమాలు పాటిస్తూ సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను సాధిస్తూ ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జీఎం ఎన్. సత్యనారాయణ, ప్రాజెక్ట్ ఆఫీసర్లు టి. శ్రీనివాస్, ఏవీ రెడ్డి, ఏరియా ఇంజనీర్ చంద్రశేఖర్ రెడ్డి, డీజీఎం ఐఈడి చిరంజీవులు, డీజీఎం పర్సనల్ పి. అరవింద రావు, ఎస్టేట్స్ మేనేజర్ వరలక్ష్మి, శ్రీరాంపూర్ ఉపరితల గని మేనేజర్ బ్రహ్మాజీ, క్వాలిటీ మేనేజర్ వెంకటేశ్వర్ రెడ్డి, పర్చేజ్ అధికారి చంద్రశేఖర్, సర్వే అధికారి సంపత్ తదితరులు పాల్గొన్నారు.