- సింగరేణి డైరెక్టర్ (పిపి) కె. వెంకటేశ్వర్లు
నస్పూర్, ఆర్.కె న్యూస్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలి ఉన్న 39 రోజులు బొగ్గు ఉత్పత్తికి అత్యంత కీలకమని, శ్రీరాంపూర్ ఏరియా నిర్ధేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనకు ప్రతి ఒక్క ఉద్యోగి కృషి చేయాలని సింగరేణి డైరెక్టర్ (పిపి) కె. వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ ఎం. శ్రీనివాస్ తో కలిసి శ్రీరాంపూర్ ఉపరితల గని పని స్థలాలు, గని ప్లాన్, కోల్ బెంచ్ లు, ఆఫ్ లోడింగ్ ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సింగరేణి డైరెక్టర్ (పిపి) ఉద్యోగులు ముందస్తు ప్రణాళికలతో రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలని, సీఆర్ఆర్, జివిఆర్ ఓబి కాంట్రాక్ట్ కంపెనీ వారు నిర్దేశించిన రోజువారీ లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన 35 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత సాధించడంలో ముందుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం ఎన్. సత్యనారాయణ, శ్రీరాంపూర్ ఉపరితల గని ప్రాజెక్ట్ ఆఫీసర్ టి. శ్రీనివాస్, ఇందారం ఉపరితల గని ప్రాజెక్ట్ ఆఫీసర్ ఏ. వెంకటేశ్వర్ రెడ్డి, ఇన్చార్జి ఏరియా ఇంజనీర్ సాంబ శివ రావు, గని మేనేజర్ బ్రహ్మాజీ, ప్రాజెక్ట్ ఇంజనీర్ నాగరాజు, ఏరియా క్వాలిటీ ఇంచార్జ్ కె వెంకటేశ్వర్ రెడ్డి, సెక్యూరిటీ ఆఫీసర్ జక్క రెడ్డి, సేఫ్టీ ఆఫీసర్ జి. సంపత్ తదితరులు పాల్గొన్నారు.