- శ్రీరాంపూర్ ఏరియా జీఎం బి. సంజీవరెడ్డి
ఆర్.కె న్యూస్, నస్పూర్: అక్టోబర్ నెల నిర్దేశిత లక్ష్యాన్ని సాధించడానికి ఉద్యోగులు, అధికారులు కృషి చేయాలని శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ బి. సంజీవ రెడ్డి అన్నారు. మంగళవారం జీఎం కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏరియా అధికారులతో గత నెల సాధించిన ఉత్పత్తి, ఉత్పాదకత పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మాట్లాడుతూ రక్షణతో కూడిన ఉత్పత్తి, ఉత్పాదకత సాధించడానికి తగిన ప్రణాళికలు వేసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. గనుల్లో యంత్రాలను 100 శాతం వినియోగించడానికి ప్రయత్నించాలని, ఉపరితల గనుల్లో ఓబి కాంట్రాక్ట్ కంపెనీ వారు నిర్దేశిత రోజువారీ లక్ష్యాన్ని సాధించాలని, అందుకు అనుగుణంగా తగిన ప్రణాళికలు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం ఎన్. సత్యనారాయణ, ప్రాజెక్టు అధికారులు టి. శ్రీనివాస్, ఏవీ రెడ్డి, ఏజీఎం (ఫైనాన్స్) మురళీధర్, ఏరియా ఇంజనీర్ చంద్రశేఖర్ రెడ్డి, ఏజెంట్లు రాముడు, శ్రీధర్, డీజీఎంలు పి. అరవింద రావు, చిరంజీవులు, మల్లయ్య, ఏరియా రక్షణ అధికారి శ్రీధర్ రావు, పర్చేజ్ ఎస్ఈ చంద్రశేఖర్, అన్ని గనుల మేనేజర్లు, రక్షణాధికారులు, అన్ని గ్రూప్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.