- శ్రీరాంపూర్ ఇంచార్జి జీఎం శ్రీనివాస్
ఆర్.కె న్యూస్, నస్పూర్: 2024-25 ఆర్థిక సంవత్సరానికి శ్రీరాంపూర్ ఏరియా నిర్ధేశిత లక్ష్యాన్ని సాధిస్తామని శ్రీరాంపూర్ ఏరియా జీఎం ఇంచార్జి శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీరాంపూర్ ఇంచార్జి జీఎం శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆగస్టు నెలలో ఆర్కే5 గని 87 శాతం, ఆర్కే6 గని 103 శాతం, ఆర్కే7 గని 71 శాతం, ఆర్కే న్యూటెక్ గని 107 శాతం, ఎస్సార్పీ 1 గని 76 శాతం, ఎస్సార్పీ 3,3ఏ గని 92, ఐకే1ఏ గని 71 శాతం ఉత్పత్తితో భూగర్భ గనులు 85 శాతం ఉత్పత్తి సాధించాయని, ఎస్సార్పీ ఓసిపి 52 శాతం, ఐకే ఓసిపి 39 శాతం ఉత్పత్తితో శ్రీరాంపూర్ ఏరియాలో 59 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు తెలిపారు. భూగర్భ గనుల్లో పాత మిషనరీల స్థానంలో కొత్త మిషనరీ ఏర్పాటు చేయడం వల్ల, అధిక వర్షాల కారణంగా ఉపరితల గనుల్లో ఉత్పత్తికి విఘాతం కలిగినట్లు తెలిపారు. సింగరేణి సంస్థ ఉత్పత్తి ,ఉత్పాదకతోపాటు కార్మికుల సంక్షేమం, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కార్మికుల కాలనీల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవసరమైన చర్యలు చేపడతామన్నారు. ఆగస్టు నెలలో 62 మంది ఉద్యోగులకు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు చేపట్టినట్లు, 14 మంది అభ్యర్థులకు కారుణ్య నియామక పత్రాలు అందజేసినట్లు తెలిపారు. 108 సర్ఫేస్ జనరల్ మజ్దూర్ ఖాళీలను అర్హులైన అభ్యర్థులతో భర్తీ చేస్తామన్నారు. కన్వేయన్స్ డ్రైవర్స్ జీతం గురించి ఇచ్చిన సమ్మె నోటీసు పై ఓనర్స్ తో చర్చించినట్లు, ఓనర్లు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎస్వోటు జీఎం సత్యనారాయణ, డీజీఎం (పర్సనల్) పి. అరవింద రావు, డీజీఎం (ఐఈడి) చిరంజీవులు, సీనియర్ పిఓ పి. కాంత రావు తదితరులు పాల్గొన్నారు.