నూతన ఎస్.డి.ఎల్ యంత్రాలు కొనుగోలు చేయాలి

  • నూతన క్యాడర్ స్కీం అమలు చేయాలి
  • ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీతారామయ్య, రాజ్ కుమార్
  • ఏఐటీయూసీ శ్రేణులకు ట్రేడ్ యూనియన్ శిక్షణ తరగతులు

    ఆర్.కె న్యూస్, నస్పూర్: సింగరేణిలో కాలం చెల్లిన ఎస్.డి.ఎల్ యంత్రాల స్థానంలో నూతన ఎస్.డి.ఎల్ యంత్రాలు కొనుగోలు చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని కోరినట్లు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్ కుమార్ లు తెలిపారు. ఆదివారం నస్పూర్ పట్టణంలోని సింగరేణి గార్డెన్స్ లో ఏఐటీయూసీ శ్రేణులకు ట్రేడ్ యూనియన్ శిక్షణ తరగతులు నిర్వహించారు. కార్మికోద్యమము, నాయకత్వ లక్షణాలు, కార్మిక చట్టాలు, లేబర్ కోడ్ లు, లౌకికవాదం, మతం మతోన్మాదం, బీజేపీ కేంద్రంలో అమలు చేస్తున్న హిందుత్వ ఎజెండా, రిటైర్డ్ కార్మికులకు బెనిఫిట్స్, స్టాండింగ్ ఆర్డర్స్, మైన్స్ రూల్స్,  వృత్తిపరమైన జబ్బుల నివారణ, గుండె జబ్బుల నివారణ, ఆరోగ్య సూత్రాలు తదితర అంశాలపై ఏఐటీయూసీ శ్రేణులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరంలో రికార్డ్ స్థాయిలో 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించిన సింగరేణి ఉద్యోగులకు బంగారు నాణెం బహుమతిగా ఇవ్వాలని, నూతన క్యాడర్ స్కీం అమలు చేయాలని, నూతన రక్షణ పరికరాలు ఇవ్వాలని సింగరేణి యాజమాన్యాన్ని అడిగినట్లు తెలిపారు. గత ఏడాది గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగినప్పటికీ ఇప్పటికీ తమకు గుర్తింపు పత్రం ఇవ్వలేదన్నారు. ఇదే విషయమై డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ కలువగా తాము కేవలం ఎన్నికలు మాత్రమే నిర్వహిస్తామని, గుర్తింపు ధృవీకరణ పత్రం సింగరేణి యాజమాన్యమే ఇస్తుందని తెలిపారన్నారు. తమకు అలవెన్సులపై ఐటీ చెల్లిస్తామనే పార్టీ అభ్యర్థులనే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపిస్తామని సింగరేణి కార్మికులు డిమాండ్ చేయాలన్నారు. కొత్త గనుల వేలం పాటలో పాల్గొనడానికి రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యానికి అనుమతి ఇవ్వాలన్నారు. కార్మికులకు 250 గజాల ఇంటి స్థలం, కారుణ్య నియామకాల్లో వారసుల వయస్సు పరిమితి 35 నుంచి 40 సంత్సరాలకు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీలు ముస్కె సమ్మయ్య, కె. వీరభద్రయ్య, బ్రాంచ్ కార్యదర్శి షేక్ బాజీ సైదా, నాయకులు ప్రసాద్ రెడ్డి, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment