- మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య
నస్పూర్, ఆర్.కె న్యూస్: నేటి బాలలే రేపటి శాస్త్రవేత్తలు అని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య అన్నారు. నస్పూర్ పట్టణంలోని ఆక్స్ ఫోర్డ్ హై స్కూల్ లో గత మూడు రోజులుగా జరిగిన ఇన్స్పైర్ బాల వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల ఆవిష్కరణలు వారి ప్రతిభను వెలికి తీస్తాయని, దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతిలో ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వాలు సైన్స్ కి ప్రాముఖ్యత ఇస్తున్నాయని, అనేక రకాల సదుపాయాలు కల్పిస్తున్నాయని తెలిపారు. డీఈవో యాదయ్య మాట్లాడుతూ ఈ సంవత్సరం ఇన్స్పైర్ బాల వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమాన్ని గొప్పగా జరుపుకున్నామని, మంచిర్యాల జిల్లా విద్యార్థులు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి అర్హత సాధిస్తున్నారని, విద్యార్థులు అద్భుత ప్రదర్శనలు చేశారని పేర్కొన్నారు. అనంతరం ఇన్స్పైర్ కు వివిధ విభాగాలలో రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ కు ఎంపిక అయిన 11 మంది విద్యార్థులకు బాల వైజ్ఞానిక ప్రదర్శనలో గెలిచిన వారికి బహుమతులు, ప్రశంసా పత్రాలు, అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రాజగోపాల్, నస్పూర్ ఎంఈఓ పద్మజ, ఎస్ ఓ విజయలక్ష్మి, ట్రస్మా నాయకులు మల్లెత్తుల రాజేంద్రపాణి, రామకృష్ణారెడ్డి, ఉపేందర్, దేవన్న, సిద్దయ్య, మైదం రామకృష్ణ, ఊట్ల సత్యనారాయణ వివిధ మండలాల ఎంఈఓలు, అధికారులు, ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ సతీష్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.





