నేతకానీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి

 తెలంగాణ నేతకాని మహర్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం రాజేష్
ఆర్.కె న్యూస్, నస్పూర్: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నేతకాని కులస్తులకు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు పోటీకి అవకాశం కల్పించాలని తెలంగాణ నేతకాని మహర్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం రాజేష్ అన్నారు. సోమవారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ నేతకాని మహర్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ, రాష్ట్రంలోని 19 ఎస్సీ రిజర్వుడ్ స్థానాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేయగల స్థాయిలో నేతకాని జనాభా ఉందన్నారు. నేతకాని కులస్తులపై రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని  తెలిపారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి  కేటీఆర్ లు కలవడానికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదన్నారు. నేతకానీలు ఎదగడానికి అన్ని పార్టీలు ఎక్కువ శాతం టికెట్లు కేటాయిస్తే పార్టీలకతీతంగా గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లో నేతకాని కులస్తులకు భవనం ఏర్పాటు చేయాలని, మంచిర్యాల జిల్లాలోని నేతకాని భవన్ నిర్మాణం పూర్తి చేయడానికి నిధులు కేటాయించాలని కోరారు. గతంలో నేతకాని అని సర్టిఫికెట్ ఇచ్చేవారని ప్రస్తుతం ఆన్లైన్ లో నెట్ కాని అని ఉండడంతో విద్యార్థుల ఉన్నత చదువులకు ఇబ్బందులు కలుగుతున్నాయని వెంటనే సవరించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ లో నేతకానీలకు అవకాశం కల్పించకపోవడం సరికాదన్నారు. నేతకాని సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని  అన్నారు. ఈ కార్యక్రమంలో నేతకాని మహర్ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కామెర ప్రకాష్, నాయకులు దుర్గం నగేష్, రాంటెంకి శంకర్, సంతోష్, యువరాజ్, శంకరయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment