50
నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్.కె న్యూటెక్ గనిలో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన ఎలక్ట్రికల్ ఫోర్ మెన్ వై. రామ్మోహన్ రావును గని మేనేజర్ కురపాటి శ్రీనివాసులు, ఎస్టీపిపి డీజీఎం ఇ. స్వామి రాజు, గుర్తింపు సంఘం ఏరియా కార్యదర్శి ఎస్.కె బాజీ సైదా గురువారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సింగరేణిలో 42 ఏళ్ల సుదీర్ఘ సేవలు అందించిన రామ్మోహన్ రావు ఉద్యోగులకు ఆదర్శంగా నిలుస్తారని, విధుల్లో నైపుణ్యం ప్రదర్శించి తన ప్రత్యేకతను చాటుకొన్నారని పేర్కొన్నారు. ఉద్యోగ విరమణ తదుపరి జీవితాన్ని కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గని రక్షణాధికారి కొట్టె రమేష్ , పిట్ కార్యదర్శి ఆకుల లక్ష్మణ్, సంక్షేమాధికారి పాల్ సృజన్, పిట్ ఇంజనీర్ రాజగోపాల చారి, సర్వే అధికారి పిచ్చేశ్వర్ రావు, వెంటిలేషన్ అధికారి చంద్రమౌళి, అండర్ మేనేజర్లు సాత్విక్, పరమేష్, డి. శ్రీనివాస్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.