ఆర్.కె న్యూస్, నస్పూర్: ఇటీవల పదవీ విరమణ పొందిన శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ బి. సంజీవ రెడ్డిని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఘనంగా సన్మానించారు. ఆదివారం నస్పూర్ పట్టణంలోని బంగ్లా ఏరియాలో జరిగిన కార్యక్రమంలో మంచిర్యాల ఎమ్మెల్యే సంజీవ రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మంచిర్యాల ఎమ్మెల్యే మాట్లాడుతూ బి. సంజీవ రెడ్డి తన సర్వీస్ కాలంలో సింగరేణి సంస్థకు అందించిన సేవలు అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ ఎల్.వి సూర్యనారాయణ, ఎస్వోటు జీఎం ఎన్. సత్యనారాయణ, జనరల్ మేనేజర్ (సేఫ్టీ, బెల్లంపల్లి రీజియన్) రఘు కుమార్, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్, జనరల్ మేనేజర్ (సివిల్) శ్రీనివాస రావు, అధికారుల సంఘం శ్రీరాంపూర్ ఏరియా అధ్యక్షులు కె. వెంకటేశ్వర్ రెడ్డి, అన్ని విభాగాల అధిపతులు, అన్ని గనుల మేనేజర్లు, అధికారుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
115