పదోన్నతి పత్రాలు అందజేత

ఆర్.కె న్యూస్, నస్పూర్: శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్.ఆర్.పి 3,3ఏ గనిలో జనరల్ మజ్దూర్ గా పదోన్నతి పొందిన 94 మంది బదిలీ వర్కర్ ఉద్యోగులకు గని డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎస్ సంతోష్ కుమార్ పదోన్నతి పత్రాలు అందజేశారు. శుక్రవారం గని ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గని డిప్యూటీ జనరల్ మేనేజర్ మాట్లాడుతూ ఉద్యోగులు రక్షణతో కూడిన ఉత్పత్తి ఉత్పాదకత సాధించి, సంస్థ పురోభివృద్ధికి తోడ్పడాలని కోరారు. బదిలీ వర్కర్ ఉద్యోగులు అనతి కాలంలోనే పదోన్నతి పొందడం సంతోషకరమని అన్నారు. అనంతరం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఏరియా ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులు భవిష్యత్తులో మరిన్ని పదోన్నతులు పొందాలని ప్రమాదరహిత సింగరేణికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సేఫ్టీ ఆఫీసర్ శ్రీధర్, డిప్యూటీ మేనేజర్ చంద్రముర్ము, ఈ మహేందర్ గౌడ్, సంక్షేమ అధికారి గౌస్ , పిట్ ఇంజనీర్ ప్రేమ్ కుమార్, సీనియర్ అండర్ మేనేజర్లు అరుణ్ కుమార్, మధుసూదన్ రావు, పూర్ణచందర్,ఇంజనీర్ సాయి శ్రావణ్, సిఐటియు బ్రాంచ్ కార్యదర్శి భాగ్యరాజు, టీబీజీకేఎస్ పిట్ కార్యదర్శి సాదుల భాస్కర్, ఏఐటీయూసీ పిట్ కార్యదర్శి మురళి చౌదరి, ఐఎన్టీయూసీ పిట్ కార్యదర్శి కే మనోజ్ కుమార్, సిఐటియు పిట్ కార్యదర్శి శ్రీనివాస్, అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment