ఆర్.కె న్యూస్, మంచిర్యాల బ్యూరో: పదో తరగతి పరీక్షలు రాయబోతున్న మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు బుధవారం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గుండేటి యోగేశ్వర్ పూర్వ విద్యార్థులు, ఆర్మీ వింగ్ ఎన్.సి.సి క్యాడెట్లు ఏదునూరి వంశీ, నల్ల నాగేంద్ర ప్రసాద్ పరీక్ష ప్యాడ్, కంపాస్ బాక్స్, పెన్నులు ఇతర సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ గురుశిష్యుల బంధం ఎంతో చిరస్మరణీయమైనదని, పూర్వ విద్యార్థులు గురుభక్తిని చాటడం ఎంతో అభినందనీయమని, వంశీ, నాగేంద్ర ప్రసాద్ లు నేటి యువతకు ఆదర్శమని అన్నారు. పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ ఆత్మవిశ్వాసంతో భయం లేకుండా పరీక్షలు రాసి ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం పూర్వ విద్యార్థులను పాఠశాల మెమెంటో, పుష్ప గుచ్చాలతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పొగాకు వెంకటేశ్వర్లు, టి. పావని, బి.నర్సింగ్, ఏ. సతీష్ కుమార్, పి.వాణిశ్రీ, విలాస్ జాదవ్, కె.సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
193