51
నస్పూర్, ఆర్.కె న్యూస్: నస్పూర్ పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పద్మశాలి సంఘం కార్యాలయం ఆవరణలో సంఘం అధ్యక్షులు చిలగాని బొడ్డయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకొని, నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంక్షేమ సంఘం నస్పూర్ ప్రెసిడెంట్ చిలగాని బొడ్డయ్య, జనరల్ సెక్రటరీ వేముల సురేష్, కోశాధికారి చిప్ప రాజబాబు, ఉపాధ్యక్షులు దేవసాని నాగరాజు, మార్కండేయ దేవాలయ కమిటీ జనరల్ సెక్రెటరీ కొండ శ్రీనివాస్, కోశాధికారి రమేష్, చిలువేరు సదానందం, ఆడేటి రాజయ్య, మోహన్ తదితరులు పాల్గొన్నారు.