మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారిపెల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ రాష్ట్రపతి అవార్డు గ్రహీత గుండేటి యోగేశ్వర్ నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో సీనియర్ జీవశాస్త్ర ఉపాధ్యాయునిగా, విద్యాశాఖ నేషనల్ గ్రీన్ కోర్ జిల్లా కోఆర్డినేటర్ గా, రాష్ట్ర శిక్షకులుగా యోగేశ్వర్ సేవలందించారు. గుండేటి యోగేశ్వర్ కు పాఠశాల ఇంచార్జీ హెచ్.ఎం. వెంకటేశ్వర్లు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం యోగేశ్వర్ పాఠశాలలో మొక్కలు నాటి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా యోగేశ్వర్ మాట్లాడుతూ అందరి సమిష్టి కృషితో ఉత్తమ ఫలితాలు సాధనకు, పాఠశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
243