పారుపల్లి ఉన్నత పాఠశాలలో ఉపాహారం ప్రారంభం

ఆర్.కె న్యూస్, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని పారుపల్లి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు సాయంకాల ఉపాహారం (స్నాక్స్) అందించే కార్యక్రమాన్ని గురువారం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గుండేటి యోగేశ్వర్ ఉపాధ్యాయులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వపరంగా ఇంకా అధికారిక ఆదేశాలు రానప్పటికీ గ్రామీణ ప్రాంత బీద కుటుంబ నేపథ్యం గల పదో తరగతి విద్యార్థులు సాయంకాలం ప్రత్యేక తరగతుల సమయంలో అధిక శాతం హాజరు ఉండాలని, విద్యార్థులు ఆకలితో ఇబ్బంది పడకుండా ఆనందంగా చదువుకోవాలని ముందస్తుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పొగాకు వెంకటేశ్వర్, టీ.పావని, బి.బిక్కు  బి .నర్సింగ్ , ఏ. సతీష్ కుమార్, పి.వాణిశ్రీ, విలాస్ యాదవ్, పదో తరగతి విద్యార్థులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment