– జాతీయ నాయకుల వేషధారణతో సందడి చేసిన చిన్నారులు
జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని కోటపల్లి మండలం పారుపెల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవం వైవిధ్యంగా, ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ట్ టీచర్ సంతోష్ మార్గదర్శనంలో విద్యార్థులు సంస్కృతి, సంప్రదాయాలు, పల్లె జీవనం, అల్లూరి సీతారామరాజు, కొమురం భీం, ఝాన్సీ లక్ష్మీబాయి, పల్లెటూరి మహిళ, ఉపాధ్యాయుడు, భరతమాత, డాక్టర్, రైతు, పురోహితుడు, పారుపెల్లి మహిళ, సంప్రదాయ స్త్రీ, తదితర ప్రత్యేక వేషధారణతో సందడి చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు గుండేటి యోగేశ్వర్ జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలతో అలంకరించారు. చాచా నెహ్రూ జీవిత విశేషాలు విద్యార్థులకు తెలియజేశారు. విద్యార్థులతో కలిసి.హెం.ఎం, ఉపాధ్యాయులు మహనీయుల డైలాగ్స్ వినిపించి సందడి చేశారు. మహనీయుల డైలాగ్స్ తో ప్రాంగణమంతా కళాకాంతులతో అలరించింది. కార్యక్రమంలో విద్యార్థులు చక్కటి హావభావాలను ప్రకటిస్తూ పాత్రాభినయం చేసి అబ్బురపరిచారు. ఈ సందర్భంగా ప్రతిభ చాటిన విద్యార్థులకు హెచ్ .ఎం.బహుమతులు అందజేసి ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పొగాకు వెంకటేశ్వర్, బి. బిక్కు, ఏ.సతీష్ కుమార్, బిక్కు, నర్సింగ్, విలాస్ జాదవ్, సంతోష్, కుమార్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
244