పులి సంచారంపై సింగరేణి అప్రమత్తం

ఓబీ డంప్ యార్డును సందర్శించిన అధికారులు
శ్రీరాంపూర్ ఏరియాలో పటిష్టమైన రక్షణ చర్యలు

నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపూర్ ఉపరితల గని పరిసరాల్లో ఇటీవల పులి సంచరించిన నేపథ్యంలో సింగరేణి ఫారెస్ట్ అడ్వైజర్ పరిగెన్, ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్, అటవీ డివిజన్ అధికారి సర్వేశ్వర్ శనివారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఓబీ డంప్ యార్డ్ ప్రాంతాన్ని పరిశీలించి, భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు.ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ కార్మికుల రక్షణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. ప్రధాన రహదారులపై బారికేడ్ల ఏర్పాటు, గని పరిసరాల్లో పిచ్చి మొక్కల తొలగింపు పూర్తి చేశామని తెలిపారు. అటవీ శాఖ పెట్రోలింగ్ కోసం సింగరేణి తరపున 24 గంటల పాటు ఒక వాహనాన్ని అందుబాటులో ఉంచామన్నారు. సెక్యూరిటీ సిబ్బంది, అటవీ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఎప్పటికప్పుడు కార్మికులను, వారి కుటుంబ సభ్యులను అప్రమత్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఉపరితల గని ప్రాజెక్ట్ అధికారి చిప్ప వెంకటేశ్వర్లు, డీజీఎం (ఫారెస్ట్) ఏబీ హరి నారాయణ, సర్వే అధికారి సంపత్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రత్నాకర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment