నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల నగర పాలక సంస్థ పరిధిలోని శ్రీరాంపూర్ సాందీపని ఉన్నత పాఠశాల 2000-2001 పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నస్పూర్ లోని బొమ్మరిల్లు ఫంక్షన్ హాల్ లో జరుపుకున్నారు. ఆదివారం నిర్వహించిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రిన్సిపాల్ మల్లెత్తుల రాజేంద్రపాణి ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన స్నేహితులందరూ 25 సంవత్సరాలకు ముందు పదో తరగతిలో విద్యను అభ్యసించిన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ, తమ క్షేమ సమాచారాలు పంచుకుంటూ, ఎంతో సరదాగా ఆటపాటలతో గడిపారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ రేగళ్ల ఉపేందర్, ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ రెడ్డి, మల్లిక్, ముష్క మల్లేష్, పూర్వ విద్యార్థులు కే. తిరుపతి, కే. సురేష్, ఏ. మధుకర్, ఈ. రమేష్, సిద్దన సాగర్, అల్లాడి సురేష్, సుమలత, రాజశ్రీ తదితరులు పాల్గొన్నారు.
17