- బెల్లంపల్లిలో సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో రాస్తా రోకో
బెల్లంపల్లి, ఆర్.కె న్యూస్: కేంద్ర ప్రభుత్వం పెంచిన వంటగ్యాస్, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ నాయకులు, కార్యకర్తలు బుధవారం రోజున బెల్లంపల్లి పట్టణంలోని బజార్ ఏరియాలో ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సంఘర్బంగా సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు మిట్టపల్లి వెంకట స్వామి, టౌన్ సెక్రెటరీ ఆడెపు రాజమౌళి లు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ పై రూ,,50లు, పెట్రోలుపై రూ|| 2, డీజిల్ రూ|| 2 పెంచి ప్రజలను కేంద్ర ప్రభుత్వం దోసుకుంటుందన్నారు. దేశంలోని మోడీ ప్రభుత్వం పెట్టుబడి దారులకు, కార్పొరేట్ శక్తులకు కొమ్ముకొస్తున్నారని విమర్శించారు. పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలను పెంచుతూ వేల కోట్లు రూపాయలను కార్పొరేట్ శక్తులకు దారదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. లేని యెడల సీపీఐ ఆద్వర్యంలో సమరశీల సంఘటిత పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర, జిల్లా, మండల, పట్టణ అనుబంధ సంఘాల నాయకులు బొల్లంపూర్ణిమ, గుండా సరోజన, గుండా చంద్ర మాణిక్యం, కొంకుల రాజేష్, రత్నం రాజం తదితరులు పాల్గొన్నారు.