పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలి

  •  పోలీస్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి
  •  మంచిర్యాల డిసిపి ఎగ్గడి భాస్కర్
  •  సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన మంచిర్యాల డిసిపి

నస్పూర్, ఆర్.కె న్యూస్: సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, మహిళలపై జరిగే నేరాలకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేయాలని మంచిర్యాల డిసిపి ఎగ్గడి భాస్కర్ అన్నారు. సోమవారం సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ ను సందర్శించి, స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు. తదుపరి స్టేషన్  రికార్డ్ తనిఖీ చేయడంతో పాటు పెండింగ్ కేసుల నేరస్థుల అరెస్టు, దర్యాప్తు, సాక్ష్యాధారాల సేకరణ, చార్జ్‌షీట్‌కు సంబంధించి ప్రస్తుత కేసుల స్థితిగతులను స్టేషన్ హౌజ్ ఆఫీసర్ యు. ఉపేందర్ రావును అడిగి తెలుసుకున్నారు. నిందితులకు కోర్టులో శిక్ష పడే విధంగా తగు సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించాలని, మహిళలు, బాలికల మిస్సింగ్‌ కేసుల్లో అధికారులు వేగంగా స్పందించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని, దొంగతనాలు జరగకుండా పోలీస్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా వుంటూ, విజబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్‌ ముమ్మరం చేయాలని, చోరీలకు పాల్పడిన నేరస్థులను గుర్తించడంతోపాటు చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడంలో అధికారులు సమయస్పూర్తితో దర్యాప్తు కొనసాగించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు  సంబంధిత డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి తగు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అన్నారు.  ఈ కార్యక్రమంలో మంచిర్యాల  రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ. అశోక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment