పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ మాదిగలకు ఇవ్వాలి

  • మాదిగ ఐక్య వేదిక నాయకులు

ఆర్.కె న్యూస్, నస్పూర్: పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ ను అన్ని రాజకీయ పార్టీలు మాదిగలకే కేటాయించాలని మాదిగ ఐక్య వేదిక నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఎస్సీ ఓట్లలో మాదిగ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్నాయని, అన్ని రాజకీయ పార్టీలు మాదిగేతరులకే ప్రాధాన్యతనిచ్చి మాదిగలను చిన్న చూపు చూస్తున్నాయని అన్నారు. గతంలో పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో బి.ఆర్.ఎస్ పార్టీ ఓడిపోవడానికి ముఖ్య కారణం ఒక్క సీటు కూడా మాదిగలకు ఇవ్వకపోవడమేనని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ, బి.ఆర్.ఎస్ పార్టీలు మాదిగలకు టికెట్ కేటాయించి వారి చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు.  గతంలో సుగుణ కుమారికి టికెట్ ఇస్తే బారి మెజార్టీతో మాదిగలు గెలిపించుకున్న విషయాన్ని గుర్తు చేశారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో మాదిగలకు టికెట్ ఇవ్వాలనే డిమాండ్ తో ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని, అందులో భాగంగా ఈనెల 25న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదిగ ఐక్య వేదిక నాయకులు మామిడిపల్లి బాపయ్య మాదిగ, మంతెన మల్లేష్ మాదిగ, రేగుంట సునీల్ మాదిగ, కోటగిరి పాపయ్య మాదిగ, కాంపెల్లి ప్రభాకర్ మాదిగ, గద్దల బానయ్య మాదిగ, పల్లె సదానందం మాదిగ, అట్కపురం సమ్మయ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment