141
ఆర్.కె న్యూస్, నస్పూర్: సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగార్జున కాలనీలో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఎస్సై ఎన్. సుగుణాకర్ తెలిపారు. బుధవారం నాగార్జున కాలనీలో ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నామని, పట్టుబడ్డ వారి నుంచి రూపాయలు 30,140 నగదు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఎక్కడైనా పేకాట స్థావరాలు కొనసాగితే తమకు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్సై ఎన్. సుగుణాకర్ అన్నారు.