పోలీస్ స్టేషన్ కి వెళ్తే సత్వర న్యాయం జరుగుతుందనే భరోసా కల్పించాలి

  • డయల్ 100 కాల్స్ కి వెంటనే స్పందించాలి
  • అసాంఘిక కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచాలి
  • రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్

ఆర్.కె న్యూస్, నస్పూర్:  పోలీస్ స్టేషన్ కి వెళ్తే సత్వర న్యాయం జరుగుతుందనే భరోసా బాధితులకు కల్పించాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ అన్నారు. సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ ను శుక్రవారం రాత్రి రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఆకస్మికంగా సందర్శించి, పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించడంతో పాటు పిటిషన్లు, వాటి రికార్డులను తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల ఫిర్యాదుల విషయంలో వెంటనే స్పందించి విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. మహిళలు, పిల్లలు, సీనియర్ సిటిజన్లతో మర్యాదగా ప్రవర్తించాలని అన్నారు. పోలీస్ స్టేషన్ రికార్డ్స్, అధికారులు, సిబ్బంది వివరాలు, వారు చేస్తున్న విధులు, పనితీరు, వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.  పోలీస్ స్టేషన్ పరిధి బౌగోలిక పరిస్థితి, కాలనీ, గ్రామాల్లో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయనే తదితర అంశాలను ఎస్ఐ సుగుణాకర్ ను  అడిగి తెలుసుకున్నారు. బ్లూ క్లోట్స్ సిబ్బంది తో మాట్లాడి డయల్ 100 కాల్స్ కి వెంటనే స్పందించి, సంఘటన స్థలానికి త్వరగా చేరుకోవాలని సూచించారు. బ్లూ క్లోట్స్, పెట్రో కార్ సిబ్బంది రాత్రి సమయంలో రౌడీ షీటర్స్ కేడిలు, డిసిలు, సస్పెక్ట్ షీట్స్ ల ఇళ్లను, పాయింట్ బుక్స్ లను తప్పనిసరిగా తనిఖీ చేయాలని అన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలు, ఫిర్యాదులు తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని, గంజాయి, మత్తు పదార్థాల సరఫరా, విక్రయం, అక్రమ రవాణా, సేవించడం, అసాంఘిక కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, మంచిర్యాల రూరల్ సీఐ అశోక్, ఎస్ఐ సుగణాకర్ ఉన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment