ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి రెండు ఇండ్లు దగ్ధం

  • సర్వం కోల్పోయి నిరాశ్రయులైన రెండు కుటుంబాలు

ఆర్.కె న్యూస్, చెన్నూరు: కాయకష్టం చేసుకుని బ్రతికే రైతు కుటుంబాలు వాళ్ళవి. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించే వారి కుటుంబాల్లో గ్యాస్ సిలిండర్ రూపకంగా వారి కుటుంబాలను రోడ్డున పడేసింది. వివరాల్లోకి వెళితే చెన్నూరు మండలం ఆస్నాద్ గ్రామంలో నేడు జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఇంగిలి లింగన్న, ఇంగిలి శ్రీనివాస్ లకు చెందిన ఇండ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. బాధితుడు ఇంగిలి లింగన్న మాట్లాడుతూ…  వ్యవసాయం చేసుకుని బ్రతికే తాము యథావిధిగా ఉదయం పూట ఇంటి పనులు ముగించుకుని వ్యవసాయ పని నిమిత్తం పొలం పనులకు వెళ్లామని, ప్రమాదవశాత్తు ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలి తన బిడ్డ పెళ్లికోసం తీసుకు వచ్చిన ఎనిమిది తులాల బంగారం, నాలుగు లక్షల రూపాయలు, నిత్యావసర సరుకులు, ఇంటి సామాన్లు కాలి బూడిదయ్యాయని ఆవేదన వ్యక్తం చేశాడు. మరొక బాధితుడు లింగన్న తమ్ముడు ఇంగిలి శ్రీనివాస్ మాట్లాడుతూ… తన అన్న ఇంటి పక్కన ఇల్లు ఉండటంతో తన ఇల్లు కాలిపోయి సర్వస్వం కోల్పోయానని, తన భార్యకు చెందిన నాలుగు తులాల బంగారం, అన్న బిడ్డ పెళ్లి కోసం దాచిన రెండు లక్షల రూపాయలు, ఇంట్లోని  వస్తువులు కాలి బూడిదయ్యిందని కన్నీరు మున్నీరు అయ్యాడు. ప్రమాద విషయాన్ని గ్రామస్తులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా స్పందించిన అధికారులు త్వరిత గతిన వచ్చి మంటలను ఆర్పారు. అప్పటికే రెండు ఇండ్లు  కాలి బూడిదయ్యాయి. అనంతరం పోలీసులు, గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది సంఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. కళ్ళముందు రెండు ఇండ్లు  కాలిపోతుంటే గ్రామస్తుల రోదనలు మిన్నంటాయి.

AD 01

Follow Me

images (40)

Leave a Comment