ప్రేమ్ సాగర్ రావు పై ఆరోపణలు మానుకోవాలి

  • నస్పూర్ మున్సిపల్ చైర్మన్ సురిమిళ్ళ వేణు

ఆర్.కె న్యూస్, నస్పూర్: మంచిర్యాల నియోజకవర్గంలో ఏ దాడులు జరిగినా, అరెస్టులు జరిగిన స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రోద్బలంతో జరుగుతున్నాయనే నిరాధార ఆరోపణలను మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మానుకోవాలని నస్పూర్ మున్సిపల్ చైర్మన్ సురిమిళ్ళ వేణు అన్నారు. మంగళవారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో దుర్గం వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడుతూ, టిఆర్ఎస్ పార్టీకి చెందిన కందుల ప్రశాంత్ ను స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఉద్దేశపూర్వకంగానే అరెస్టు చేయించారని చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీ తరపున ఖండిస్తున్నట్లు తెలిపారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బిఆర్ఎస్ నాయకులు లబ్దిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడానికి డబ్బులు వసూలు చేశారని అన్నారు. ప్రేమ్ సాగర్ రావు గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కందుల ప్రశాంత్  తన ఇంటి సమీపంలో ఉండే  దుర్గం వెంకటేశ్వర్లు ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి అతని సెల్ ఫోన్, లాప్టాప్ ను తీసుకోవడంతోపాటు దుర్గం వెంకటేశ్వర్లు, అతని తల్లిదండ్రులను ఇష్టం వచ్చినట్లు తిడుతూ, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని కులం పేరుతో దూషించడంతో బాధిత కుటుంబ సభ్యులు కందుల ప్రశాంత్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని అన్నారు. అనంతరం దుర్గం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, కందుల ప్రశాంత్ పై తాను చేసిన ఫిర్యాదు విషయంలో స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పూజారి తిరుపతి, మున్సిపల్  కౌన్సిలర్ మడిగ మల్లయ్య, డిసిసి సెక్రటరీ భూపతి శీను, నాయకులు కోడూరి విజయ్,  గెల్లు మల్లేష్, మాజీ జిల్లా యువత అధ్యక్షుడు తాళ్ల సంపత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment