ఆర్.కె న్యూస్, నస్పూర్: శ్రీరాంపూర్ ఏరియా నూతన ఏరియా సెక్యూరిటీ అధికారిగా జక్కా రెడ్డి సోమవారం ఎస్ అండ్ పిసి కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహించిన సెక్యూరిటీ అధికారి మురళీమోహన్ బదిలీపై భూపాలపల్లి ఏరియా కు వెళ్లారు.ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఇద్దరు సెక్యూరిటీ అధికారులను పర్మనెంట్, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు ఘనంగా సన్మానించారు. అనంతరం నూతన సెక్యూరిటీ అధికారి జక్కా రెడ్డి మాట్లాడుతూ సింగరేణి ఆస్తుల పరిరక్షణలో సెక్యూరిటీ గార్డుల పాత్ర కీలకమైనదని, సింగరేణి ఆస్తుల రక్షణే లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఇన్స్పెక్టర్ లు పోగుల స్వామి, రామిరెడ్డి, జూనియర్ ఇన్స్పెక్టర్ సిర్ర రాజయ్య, జమ్మేదార్ లు కనకయ్య, రామ్ చందర్, నాగ మల్లేష్, కళ్యాణ్, గుర్తింపు సంఘం ఏరియా బ్రాంచ్ సెక్రటరీ బాజీ సైదా, పిట్ సెక్రటరీ ఆడెపు మల్లికార్జున్, మంచిర్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
125