భారతీయ జనతా పార్టీతోనే తెలంగాణ రాష్ట్రంలో సుపరిపాలన సాధ్యమని మంచిర్యాల బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెరబెల్లి రఘునాథ్ సతీమణి స్రవంతి అన్నారు. మంగళవారం నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఝాన్సీ నగర్, భగత్ సింగ్ నగర్ లలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి వెరబెల్లి రఘునాథ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా వెరబెల్లి స్రవంతి రఘునాథ్ మాట్లాడుతూ ప్రతి ఇంటికి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలంటే డబల్ ఇంజిన్ సర్కార్ తోనే సాధ్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఈర్ల సదానందం, పానుగంటి మధు, మిట్టపల్లి మొగిలి, కొండా వెంకటేష్, పాషా, బద్రి శ్రీకాంత్, కుర్రే చక్రి, తాడూరి మహేష్ తదితరులు పాల్గొన్నారు.
229