బేటి బచావో- బేటి పడావో పథకం పై విద్యార్థులకు అవగాహన

ఆర్.కె న్యూస్, నస్పూర్: జిల్లా మహిళా సాధికారత కేంద్రం వారు బేటి బచావో బేటి పడావో పథకం, బాలికలు, మహిళల సంరక్షణ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మంగళవారం నస్పూర్ పట్టణంలోని ఎయిమ్స్ హై స్కూల్ లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం జెండర్ స్పెషలిస్ట్ విజయ, ఆర్థిక అక్షరాస్యత నిపుణురాలు లిప్సికలు పాల్గొని మాట్లాడుతూ, బేటి బచావో బేటి పడావో పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, విదివిధానాలు విద్యార్థులకు వివరించారు. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ చట్టం, లింగ సమానత్వం, బాల్యవివాహాల నిరోధక చట్టం, ఆన్లైన్ సేఫ్టీ, సైబర్ క్రైమ్, సుకన్య సమృద్ధి యోజన, మిషన్ వాత్సల్య, ఆడపిల్లల ప్రాముఖ్యత, మహిళా సాధికారత, పోక్సో యాక్ట్, డిజిటల్ ఎడ్యుకేషన్, మహిళా హెల్ప్ లైన్ నెంబర్ 1930, సఖి సర్వీసెస్ హెల్ప్ లైన్ నెంబర్ 181, చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098,  పోలీస్ హెల్ప్ లైన్ 100, సీనియర్ సిటిజన్ హెల్ప్ లైన్ నెంబర్ 14567, నేషనల్ ఎమర్జెన్సీ నెంబర్ 112, హెల్ప్ లైన్ నెంబర్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ మైదం రామకృష్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment