బై..బై.. గణేశా… గణనాథునికి ఘనంగా వీడ్కోలు  

  • ఘనంగా వినాయక నిమజ్జనం
  • బందోబస్తు నిర్వహించిన పోలీసులు  

నస్పూర్, ఆర్.కె న్యూస్: గణపతి బప్పా మోరియా, జై బోలో గణేష్ మహారాజ్ కీ జై, పుడ్చ్యా వర్షి లవ్కర్ యా” (గణపతి బప్పా, వచ్చే ఏడాది త్వరగా రా) అంటూ నినాదాలు చేస్తూ, భక్తి పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ తమ భక్తిని చాటుకుంటారు. వినాయక ఇక సెలవు అంటూ భక్తి ప్రపత్తులతో విఘ్నాలకు అధిపతి, ప్రథమ పూజ్యుడు, ఆదిదేవుడు గణనాథునికి వీడ్కోలు పలికారు. నస్పూర్ పట్టణ పరిధిలో మండపాల్లో ప్రతిష్ఠించిన వినాయకులకు తొమ్మిది రోజుల పాటు అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం నస్పూర్ పట్టణంలోని శ్రీలక్ష్మి గణేష్ మండలి వద్ద కమిటీ సభ్యులు, భక్తులు గణనాథునికి అర్చకులు సముద్రాల వెంకట రమణ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. భారీగా వచ్చిన భక్తులతో వినాయక మండపం పరిసరాలల్లో సందడి నెలకొంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సంప్రదాయ వస్త్రధారణతో యువతీ, యువకులు నృత్యాలు చేస్తూ రంగులు చల్లుకుంటూ, కేరింతలు కొడుతూ భక్తి ప్రపత్తులతో గణనాథునికి సెలవు పలికారు. నిమజ్జన ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. లారీని మామిడి తోరణాలతో ముస్తాబు చేసి విఘ్నేశ్వరుడిని నిమజ్జనానికి తరలించారు. మంచిర్యాల రూరల్ సీఐ అశోక్, సీసీసీ నస్పూర్ ఎస్‌ఐ యు. ఉపేందర్ రావులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బలగాలతో పటిష్ట బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు జక్కినబోయిన గోపాల్, అనుమండ్ల వెంకట్ రెడ్డి, రామగిరి బాలరాజు, మండల తిరుపతి, క్యాతం రాజేష్, టేకుమట్ల అంజయ్య, గోపతి తిరుపతి, బేర సత్యం, చిందం రాజు, ఇప్పలపల్లి రాయమల్లు, చందా శ్రీనివాస్, మండల శివ, చందా శివ, మహిళలు, చిన్నారులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment