బొగ్గు బ్లాకుల వేలాన్ని అడ్డుకుంటేనే సింగరేణి మనుగడ

  • బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని గెలిపించాలి
  • టిబిజికెఎస్ రాష్ట్ర అధ్యక్షుడు  మిర్యాల రాజి రెడ్డి

ఆర్.కె న్యూస్, నస్పూర్: బొగ్గు బ్లాకుల వేలాన్ని అడ్డుకుంటేనే సింగరేణి సంస్థ మనుగడ సాధ్యమని టిబిజికెఎస్ రాష్ట్ర అధ్యక్షుడు  మిర్యాల రాజి రెడ్డి అన్నారు. శుక్రవారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడుతూ,  రాష్ట్ర ప్రభుత్వం, గుర్తింపు సంఘం సింగరేణి సంస్థ కేంద్ర ప్రభుత్వం నిర్వహించే బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొనాలని చెప్పడం సరికాదని అన్నారు. వేలంలో పాల్గొంటే సింగరేణి సంస్థకే గనులు వస్తాయని  గ్యారెంటీ లేదని, ప్రైవేట్ సంస్థలకు కూడా రావచ్చునని తెలిపారు. వేలం లేకుండా సింగరేణి సంస్థకు గనులను కేటాయించాలన్నారు. కార్మికుల సంఖ్య తగ్గుదలపై ఇతర కార్మిక సంఘాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కార్మికుల తగ్గుదల గురించి ఎక్కడ చర్చకు టిబిజికెఎస్ యూనియన్ సిద్ధంగా ఉందని తెలిపారు. జాతీయ కార్మిక సంఘాల అనాలోచిత నిర్ణయం కారణంగా వారసత్వ ఉద్యోగాలు లేకుండా పోయాయని, టిబిజికెఎస్ యూనియన్ పోరాటంతోనే గని కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. సింగరేణి కార్మికులకు ఎన్నో హక్కులు సాధించిన ఘనత తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి దక్కుతుందన్నారు. పెన్షన్ విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కార్మికుల సమస్యలు తెలిసిన వ్యక్తి, మాజీ సింగరేణి కార్మికుడు, బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి  కొప్పుల ఈశ్వర్ ను కార్మికులు, కోల్ బెల్ట్ ప్రాంత ప్రజలు ఆలోచించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, పెట్టెం లక్ష్మణ్, పానుగంటి సత్తయ్య, పొగాకు రమేష్, మహిపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అన్వేష్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రమేష్, సందీప్ రెడ్డి, కేతిరెడ్డి తిరుమల్, నరేష్, హరీష్, రవి బ్రాంచ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment