భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజలు

ఆర్.కె న్యూస్, నస్పూర్: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం నస్పూర్ పట్టణంలోని శ్రీలక్ష్మి గణేష్ మండలి వద్ద  అర్చకులు సముద్రాల వెంకట రమణాచార్యుల ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కుంకుమార్చన పూజలో మహిళలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గణేష్ నవరాత్రులను పురస్కరించుకొని శ్రీలక్ష్మి గణేష్ మండలి కమిటీ ఆధ్వర్యంలో విఘ్నేశ్వరునికి తిరోక్క పూలు, నైవేద్యం సమర్పించి భక్తితో కొలుస్తున్నారు. గణపతి బప్పా మోరియా, గణేష్ మహారాజ్ కి జై అనే భక్తుల నినాదాలతో గణేష్ మండపం పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అనుమాండ్ల వెంకట్ రెడ్డి,  జక్కినబోయిన గోపాల్, రామగిరి బాలరాజు, క్యాతం రాజేష్, కాటం రామ్ రెడ్డి, టేకుమట్ల అంజయ్య, మండల తిరుపతి, తిరుపతి గౌడ్, రాయమల్లు,  స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment