మంచినీటి సరఫరాలో సింగరేణి యాజమాన్యం వైఫల్యం

  • కాంట్రాక్టర్ల లబ్ధి కోసమే పంపులు తొలగించారు

  • టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి

నస్పూర్,  ఆర్.కె న్యూస్: శ్రీరాంపూర్ ఏరియాలోని కార్మికుల కాలనీలకు, మందమర్రి, రామకృష్ణాపూర్ ఏరియాలకు గోదావరి రక్షిత మంచినీటిని సరఫరా చేయడంలో సింగరేణి యాజమాన్యం పూర్తిగా విఫలమైందని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి మండిపడ్డారు. గురువారం నాడు టీబీజీకేఎస్ నాయకులు శ్రీరాంపూర్ లోని గోదావరి ఇంటెక్ వెల్, పంప్ హౌస్ లను సందర్శించారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి మాట్లాడుతూ గత మూడు రోజుల నుండి శ్రీరాంపూర్, ఆర్.కె 8, ఆర్.కె 6 కాలనీలు, గాంధీనగర్, కృష్ణ కాలనీ, ఆర్.కె 6 గుడిసెలు ప్రాంతాలకు నీటి సరఫరా నిలిచిపోయి కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నస్పూర్, గోదావరి కాలనీ, నాగార్జున కాలనీ, సిసిసి టౌన్ షిప్ లలో కూడా ఇదే దుస్థితి నెలకొందని తెలిపారు. డిసెంబర్ నెలలోనే నీటి ఎద్దడి తలెత్తడం యాజమాన్య వైఫల్యానికి నిదర్శనమన్నారు. సివిల్ డిపార్ట్‌మెంట్‌లో పర్మినెంట్ ఉద్యోగులను తగ్గించి, కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకే యాజమాన్యం ఇంటెక్ వెల్ ను బంద్ చేసి, మోటార్లను తొలగించిందని ఆరోపించారు. గోదావరి పంప్ హౌస్ లో 190 హెచ్ పి సామర్థ్యం గల ఆరు పంపులు ఉండగా, కేవలం రెండు పంపులతో నీటిని తోడటం వల్లే నీటి కొరత ఏర్పడిందని తెలిపారు. యాజమాన్యం సీఎస్ఆర్, డీ.ఎం.ఎఫ్.టి నిధుల ద్వారా సింగరేణికి సంబంధం లేని పనులకు, యూనివర్సిటీలకు, ఫర్నిచర్ కి కోట్లు ఖర్చు చేస్తోందని, కానీ సొంత కార్మికులకు మౌలిక వసతులు కల్పించడంలో విఫలమైందని విమర్శించారు. సంక్షేమం పేరుతో ఎల్ఈడి స్క్రీన్ లు , కరపత్రాల ప్రచారానికే పరిమితమయ్యారని ధ్వజమెత్తారు. తక్షణమే గోదావరి రక్షిత మంచినీటి సరఫరా పునరుద్ధరించాలని, గతంలో కోట్లు వెచ్చించి నిర్మించిన ఇంటెక్ వెల్ ఫిల్టర్ బెడ్ ను అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. సివిల్ డిపార్ట్‌మెంట్‌లో సిబ్బందిని పెంచి, భవిష్యత్తులో వేసవి కాలం దృష్ట్యా నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. లేనిపక్షంలో కార్మికుల కుటుంబాలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షులు బండి రమేష్, కేంద్ర సంయుక్త కార్యదర్శి పానుగంటి సత్తయ్య, కేంద్ర చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పొగాకు రమేష్, ఏరియా కార్యదర్శి గడ్డం మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment