ఆర్.కె న్యూస్, మంచిర్యాల: వృత్తి నైపుణ్యం పొందిన మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ తిరుపతి అన్నారు. మంగళవారం మంచిర్యాల పట్టణంలోని ఆండాళమ్మ కాలనీలో వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ నేర్చుకున్న మహిళలకు స్వయం ఉపాధి కుటీర పరిశ్రమల స్థాపనపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ వివిధ రంగాల్లో వృత్తి నైపుణ్యం సాధించిన మహిళలకు స్వయం ఉపాధి పొందేందుకు కుటీర పరిశ్రమలు స్థాపించేందుకు జిల్లాలోని వివిధ బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయంగా తక్కువ వడ్డీతో రుణాలు ఇప్పించడం జరుగుతుందని, మహిళలు ఉపాధి పొందడమే కాకుండా ఇతర ప్రాంతాలలోని మహిళలకు ఆదర్శకంగా నిలిచి స్ఫూర్తి పొందేలా అవగాహన కల్పించాలని తెలిపారు. మహిళా సాధికారికత సాధ్యమైనప్పుడే కుటుంబాలు ఆర్థికంగా బలపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వయోజనవిద్యా శాఖ ఇన్చార్జ్ అధికారి ఎ. పురుషోత్తంనాయక్, డి.ఆర్.పి.లు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
226