మహిళల రక్షణ, భద్రత పోలీసుల బాధ్యత

  • మహిళ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్

ఆర్.కె న్యూస్, నస్పూర్:  సమాజంలో మహిళల రక్షణతో పాటు వారి భద్రత విషయంలో పోలీసులు, షీ టీమ్స్ అత్యంత బాధ్యత యుతంగా వ్యవహరిస్తాయని, పిల్లలు, మహిళల మీద జరిగే నేరాలకు భరోసా సెంటర్ వాళ్ళు చూస్తారని మహిళ పోలీసు స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ అన్నారు. ఈ మేరకు మంగళవారం రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఆదేశాల మేరకు  నస్పూర్ పట్టణంలోని కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయలోని విద్యార్థులకు సైబర్ మోసాలు, మహిళలపై జరిగే నేరాలు, ర్యాగింగ్, పొక్సో, ఆత్మహత్యలు, మహిళా చట్టాల పై షీ టీమ్స్, భరోసా సెంటర్ తో కలిసి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళ పోలీసు స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న పరిస్థితులను గమనిస్తూ మహిళలు, బాలికలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. భవిష్యత్తులో ఉన్నత స్థానంలో నిలబెట్టేది చదువు మాత్రమేనని, నిర్లక్ష్యం చేయరాదని విద్యార్థులకు సూచించారు. అమ్మాయిలను ఎవరైనా ఈవిటీజింగ్, వేధింపులకు గురి చేస్తే వెంటనే షీ టీం, స్థానిక పోలీసులకు ధైర్యంగా ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని అన్నారు. ప్రస్తుతం సెల్ ఫోన్ వినియోగం ఎక్కువైందని, తగ్గించుకొని చదువు పైన శ్రద్ధ పెట్టాలని సూచించారు. విద్యార్థులు చిన్న చిన్న విషయాలకు ఆవేదనకు గురి అయి, కృంగిపోయి, ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకోకూడదని అన్నారు. యాజమాన్యం ప్రతి స్కూల్ ఆవరణలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఎస్ ఓ మౌనిక, భరోసా కో ఆర్డినేటర్ విజయ, షీ టీం సిబ్బంది, భరోసా సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment