మహిళల రక్షణ, భద్రత షి టీం బాధ్యత

  • మహిళల భద్రతకు ప్రాధాన్యం
  • వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు
  • జిల్లా షీ టీమ్ ఇంఛార్జి ఎస్ఐ హైమ

ఆర్.కె న్యూస్, మంచిర్యాల: మహిళల రక్షణ, భద్రత షి టీం బాధ్యత అని మంచిర్యాల జిల్లా షీ టీమ్ ఇంఛార్జి ఎస్ఐ హైమ అన్నారు. గురువారం మంచిర్యాల పట్టణంలోని శ్రీ నందిని నృత్యాలయం విద్యార్థినిలకు మంచిర్యాల షీ టీం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా షీ టీమ్ ఇంఛార్జి మాట్లాడుతూ  రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మహిళల భద్రత దృష్ట్యా మీ భద్రతే మా లక్ష్యం’ అనే నినాదంతో “అభయ (మై ఆటో సేఫ్) మొబైల్ అప్లికేషన్ ను ప్రారంభించారని, అత్యవసర సమయంలో యాప్ ఎలా వినియోగించాలి, యాప్ ఉపయోగాలను విద్యార్థులు, ఉపాధ్యాయులకు వివరించారు. ఆకతాయిల ఆట కట్టించి మహిళలకు రక్షణ కల్పించడం షి టీం బాధ్యత అని, ఏదైనా సమస్య ఎదురైతే మహిళలు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని, స్కూల్ విద్యార్ధినిలకు సైబర్ నేరాలు, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పట్ల అవగాహన కల్పించడంతో పాటు హాక్ ఐ యాప్ గురించి వివరించారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తక్షణమే షీ టీం పోలీసులు స్పందించి మహిళకు సహాయం చేస్తాయని తెలిపారు. మహిళలు అత్యవసర సమయంలో డయల్ 100కు గానీ, రామగుండం పోలీస్ కమిషనరేట్ షీ టీమ్ 6303923700 నెంబర్ కు గానీ, స్థానిక పోలీస్ అధికారులకు గానీ ఫిర్యాదు చేయాలన్నారు.  ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో షీ టీం కానిస్టేబుల్ జి. సతీష్, శ్రావణ్, మహిళా కానిస్టేబుల్ జ్యోతి, శ్రీ నందిని నృత్యాలయం గురువు కల్పన, టీచర్స్, విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment