మార్పు రావాలి, సిఐటియు గెలవాలి

– సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్
ఆర్.కె న్యూస్, నస్పూర్
సింగరేణిలో నిజాయితీగా పనిచేసే యూనియన్ రావాలని, అందుకే మార్పు రావాలని, సిఐటియు గెలవాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ తెలిపారు. బుధవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే5, ఎస్సార్పీ 3 గనులపై జరిగిన గేట్ మీటింగ్ లలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు మాట్లాడుతూ, కార్మికుల ఓట్లతో గెలిచి నిజాయితీగా పనిచేయాల్సిన సంఘాలు ప్రతి పనికి రేటు కట్టి కార్మికులను ఇబ్బందులకు గురి చేశాయని, నిజాయితీగా పనిచేసే సిఐటియును గెలిపించాలని కోరారు. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు, రఘునందన్ రావు లాంటి వారిని హైదరాబాద్ చుట్టుపక్కల పరిశ్రమల్లో ఓడించామని, సింగరేణిలో సైతం అవినీతి అంతం చేయడానికి సిఐటియు ఉదయించే సూర్యుని గుర్తుకు ఓటు వేయాలని కోరారు. మెడికల్ బోర్డులలో, ప్రమోషన్లలో అవినీతి జరుగుతుందని, కార్మికుడు పదవీ విరమణ పొందిన తర్వాత రావాల్సిన బెనిఫిట్స్ సైతం ఇవ్వడానికి అనేక ఇబ్బందులు పడుతున్న తీరును కార్మికులు గమనించాలని,  ప్రతి కార్మికుడు తన జీతంలో నుండి మూడు నాలుగు నెలలు టాక్స్ కడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను పట్టించుకోకుండా చివరకు దాచుకున్న పట్టు పైసలు సైతం టాక్స్ వేసేలా చట్టాలు చేస్తున్నారని,  రాష్ట్ర ప్రభుత్వం అధిక శాతం వాటాదారుగా ఉన్న సింగరేణి భూగర్భ గనుల అనుమతులు తెచ్చుకోవడంలో విఫలమైందన్నారు. ప్రభుత్వం ఏదైనా కార్మికులకు వ్యతిరేకమే అని, ప్రభుత్వ అనుబంధ సంఘాలతో కార్మికులకు ఒరిగేదేమీ లేదని, ఇన్ని రోజులు టీఆర్ఎస్ ప్రభుత్వ అనుబంధ సంఘం టీబీజీకేఎస్, ఇప్పుడు కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయుసీ వచ్చిన రేపు అదే జరుగుతుందని కార్మికులు గమనించాలని కోరారు. ఏఐటీయూసీ గెలిచిన ఏరియాలో ఒక తీరు, ఓడిన ఏరియాలో ఒక తీరు ఆందోళన చేస్తున్న విషయాన్ని గమనించాలని, స్థానిక సమస్యల పైన సిఐటియు చేస్తున్న పోరాటాలను గమనిస్తున్న కార్మికులు ఈసారి పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి, దుంపల రంజిత్ కుమార్, డివిజన్ కార్యదర్శి గోదారి భాగ్యరాజ్, బ్రాంచ్ అధ్యక్షులు బాలాజీ, ఆర్గనైజర్ వెంగళ శ్రీనివాస్, అజయ్, సాయిల శ్రీనివాస్, సదానందం, మిడివెల్లి శ్రీనివాస్, నరేష్, రవీందర్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment